చెన్నమనేని పౌరసత్వంపై హోంశాఖకు పొన్నం లేఖ

దిశ, న్యూస్‌బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఎమ్మెల్యే రమేష్ దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. 1993లో రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని, 2009లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం తీసుకున్నారని లేఖలో వివరించారు. 2013ఆగస్టు 14న దేశ పౌరసత్వం రద్దు చేస్తూ, ఓటర్ జాబితాలో పేరును తొలగిస్తూ రమేష్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేశారని గుర్తు చేశారు. దీనిపై రమేష్ సుప్రీం […]

Update: 2020-09-07 08:55 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఎమ్మెల్యే రమేష్ దేశ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. 1993లో రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని, 2009లో తప్పుడు ధృవీకరణ పత్రాలతో భారతదేశ పౌరసత్వం తీసుకున్నారని లేఖలో వివరించారు.

2013ఆగస్టు 14న దేశ పౌరసత్వం రద్దు చేస్తూ, ఓటర్ జాబితాలో పేరును తొలగిస్తూ రమేష్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేశారని గుర్తు చేశారు. దీనిపై రమేష్ సుప్రీం కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, ఆ స్టే ఎత్తి వేయాలని ఆది శ్రీనివాస్ కోర్టులో కేసు వేశారని, హోంశాఖలో కేసు పెండింగ్ ఉందని లేఖలో వివరించారు. గత 11 ఏళ్లుగా భారతీయుడిగా చెప్పుకుంటూ అధికారం అనుభవిస్తూ జర్మనీ పాస్‌పోర్టు మీద ప్రయాణం చేస్తున్నారన్నారు. ఇది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమేనని, వెంటనే రమేష్‌పై చర్య తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

Tags:    

Similar News