AP Elections 2024: ఏపీలో గెలిచేది ఆ పార్టీనే.. తేల్చేసిన ప్రజా సర్వే.. కారణాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి.

Update: 2024-05-10 05:17 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ అటు రాజకీయ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబర్లు ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడగగా, ఎక్కువ మంది ఏపీలో కూటమిదే గెలుపని తేల్చి చెప్పారు. అలానే పలు ప్రముఖ సర్వే సంస్థలు కూడ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చాయి.

విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చివరి వృద్థులు సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైసీపీకి వ్యతిరేకత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.

విద్యార్థులు వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు..?

వైసీపీ అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ రద్దు చేసింది, అది కూడ విద్యార్థులకు పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో విద్యార్థలు ఉతీర్ణత సాదించిన తరువాత, ఉతీర్ణులైన విద్యార్థులు ఏ కళాశాలో సీటు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పీజీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ రద్దు చేశారు.

దీనితో చాలా మంది విద్యార్థులకు పీజీ చేయాలి అనే కల కలగానే మిగిలిపోయింది. అలానే రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన డిగ్రీ విద్యార్థులకు కూడా సకాలంలో రీయింబర్స్‌మెంట్ అందలేదు. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు ఫీజు కడితేనే హాల్‌టికెట్ ఇస్తమని చెప్పడంతో చాలా మంది విద్యార్థుల పరీక్షల సమయంలో ఇబ్బందులను ఎదురుకొన్న విషయం తెలిసిందే. దీనితో విద్యార్థులు వైసీపీపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

వైసీపీపై భగ్గుమంటున్న నిరుద్యోగులు

గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క కంపెనీ కూడా రాలేదు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుధ్యోగులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అని, పక్క రాష్ట్రాల్లో పెద్దపెద్ద కంపెనీలు వస్తుంటే, ఏపీ సీఎం చేపలు, రొయ్యలు అంటున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను కూడా అనాలోచిత వైఖరితో తరిమేసారని వైసీపీపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీపై ఉక్కుపాదం మోపుతున్న ఉద్యోగులు, రైతులు, వృద్థులు, మహిళలు

జీతాలు పెంచలేదని, సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదని ఉద్యోగులు, జగన్ రైతులకు ఓ చేత్తో ఒక రూపాయి ఇచ్చి మరో చేత్తో పది రూపాయలు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అముఖ్యంగా అమరావతి రైతులు వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే చాలా మంది వృద్దులకు రకరకాల కారణాలు చూపి వృద్ధాప్య పెన్షన్‌ను రద్దు చేశారు.

మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను అని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. దీనితో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత చోటు చేసుకుంది.అలానే వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, సొంత చెల్లిపై నలుగురిలో వ్యక్తిగత విమర్శలు చేయడం కూడా వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. కాగా వైసీపీ తప్పిదాలన్నీ కూటమికి వరాలుగా మారాయి. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News