Pawan Kalyan పై RGV ప్రశ్నల వర్షం.. జనసేనాని ఆ తొమ్మిది జవాబులు ఇచ్చేనా..?

చంద్రబాబు అరెస్ట్‌తో సోషల్ మీడియా వేదికగా ఆర్‌జీవి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

Update: 2023-09-11 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌తో సోషల్ మీడియా వేదికగా ఆర్‌జీవి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు ఆర్జీవి ట్విట్టర్ వేదికగా 9 ప్రశ్నలు వేశాడు. ఈ మేరకు ‘‘ గౌరవనీయులైన శ్రీ PawanKalyan, నా ఈ కింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్

1. అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?

2. ఒకవేళ జరిగి ఉంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?

3. రూ.300 కోట్లు పైగా ప్రజాధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా, ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?

4. ఒకవేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే, దానిమీద ఇమ్మిడియట్ యాక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?

5. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్‌లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?

6. చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?

7. సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?

8. లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?

9. నా తొమ్మిదవ చివరి ప్రశ్న. అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందా..? దానిలోని తప్పులెంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా? థాంక్యూ అండి’’ అంటూ ట్వీట్ చేశాడు. మరి ఈ ప్రశ్నలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : వేణు స్వామితో పూజలు చేయించుకున్న మహేష్ బాబు.. వైరలవుతున్న ఫొటో..!!

Tags:    

Similar News