భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసింది.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన తాను చేపట్టిన భారత్ జోడో యాత్రపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Update: 2023-05-31 04:58 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన తాను చేపట్టిన భారత్ జోడో యాత్రపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసిందని అన్నారు. భారత్ జోడో యాత్ర ఆద్యంతం ప్రేమ, అప్యాయత, గౌరవంతో కొనసాగిందని తెలిపారు. ఒకసారి దేశ చరిత్రను గమనిస్తే గురునానక్ దేవ్ జీ, గురు బసవన్న జీ, నారాయణ గురు జీ వంటి ఆధ్యాత్మికవేత్తలు దేశాన్ని ఇదే విధంగా ఏకం చేశారని రాహుల్ చెప్పుకొచ్చారు. వాళ్ల మార్గంలో తాను కూడా దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News