టీడీపీ, పోలీసులు, సీఈసీ కలిసి పిన్నెల్లిని హత్య చేయాలని చూస్తున్నారు.. పేర్ని నాని

నేడు మీడియా సమావేశంలో వైసీపీ నేత పేర్ని నాని 13 వ తేదీ ఏపీలో చోటు చేసుకున్న ఘటనలపై మాట్లాడుతున్నారు

Update: 2024-05-26 08:29 GMT

దిశ వెబ్ డెస్క్: నేడు మీడియా సమావేశంలో వైసీపీ నేత పేర్ని నాని 13 వ తేదీ ఏపీలో చోటు చేసుకున్న ఘటనలపై మాట్లాడుతున్నారు. కారంపూడిలో టీడీపీకి మెజారిటీ ఎక్కువ, అందరూ చంద్రబాబు నాయుడు కులస్ధులు అనేది జగమెరిగిన వాస్తవం అని అన్నారు. ఈ నేపథ్యంలో 13 వ తేదీన మాచర్ల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో హిసాత్మకఘటనలు చోటు చేసుకోనున్నాయని ముందుగానే ఊహించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి, ఎస్పీకి, డీజీకి, ఈసీకి అధికారులందరికీ పిటీషన్ సమర్పిచారని పేర్కొన్నారు.

అయితే పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారని, ముందస్తు జాగ్రత్తలు తీసేకోలేదని మండిపడ్డారు. పోలింగ్ వేళ పాలరాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న దలితులను, మైనారిటీలను, వైసీపీ సానుభూతి పరులను అడ్డుకోని, కర్రలతో, రాడ్డులతో కొట్టి గాయపరుస్తున్నా, గుంటూరు ఏసీపీ సుప్రజ అక్కడే ఉండి చోద్యం చూశారేగాని, అల్లరిమూకలను చెదరగొట్టే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ విడుదల చేసిన వీడియ్యోల్లో ఏసీపీ సుప్రజ వాహనం అక్కడే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అలానే సీఈసీ సైతం ధుర్మార్గంగా ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. ఆధారాలను పరిశీలించకుండానే పిన్నెల్లిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిందని మండిపడ్డారు. 13వ తేదీ ఈవిఎంలను ధ్వసం చేస్తే, 15వ తేదీ వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందని, ఎందుకు 13వ తేదీన ఎప్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించారు.

ఈవిఎంలను ధ్వసం చేసిన వెంటనే ప్రిసైడింగ్ అదికారి తన పై అదికారులకు ఫిర్యాదు చేయాలి, పోలీసులు రావాలి, నేరస్తులను అరెస్ట్ చేయాలి, ఇవేమీ జరగలేదని, అలానే సంబంధిత పోలింగ్ బూత్‌లో పోలింగ్ ఆగినట్టు కూడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. పోలీసుల రికార్డులో గుర్తు తెలియని వ్యక్తి అని ఉందని, ఎమ్మెల్యేని ఎన్నికల సిబ్బంది గుర్తుపట్టలేరా..

? అక్కడ టీడీపీ ఏజెంట్లు సైతం ఉన్నారుగా.. ఎందుకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు అని ప్రశ్నించారు. 20వ తేదీన పిన్నెల్లి ఈవిఎంలను పగలగొట్టినట్టు ఓ వీడియోని లోకేష్ ట్వీట్ చేశారని, ఈ నేపథ్యంలో సీఈసీ లోకేష్‌కి నోటీసులు ఇవ్వాలి, అలాగే ఏపీ సీఈఓని కూడా విచారించాలి, కాని ఇవేమీ చెయ్యకుండా, సీఈసీ భరితెగించి ఎమ్మెల్లేపై ఎఫైఆర్ ఫైల్ చేశారా..?

అరెస్ట్ చేశారా? అని అడుగుతుందని మండిపడ్డారు. అసలు అతను ఎమ్మెల్యే అని ఎవరు చెప్పారు, నువ్వు అడిగావా అని సీఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేరస్తేలను వదిలేసి అమాయకలను కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, పోలీసులు, సీఈసీ కలిసి పిన్నెల్లిని హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Similar News