‘దర్యాప్తు జరుగుతోంది.. చంద్రబాబు అరెస్ట్‌ను ఎవరూ ఆపలేరు’

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పని అయిపోంది అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.

Update: 2023-05-06 07:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పని అయిపోంది అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు అవినీతిపై సిట్ విచారణ జరుగుతుందని అరెస్ట్ అవ్వడం తథ్యమన్నారు. ఎక్కడ అరెస్ట్ అవుతారనే భయంతోనే చంద్రబాబు నాయుడు జనాల మధ్య తీరుతున్నారు అని ఆరోపించారు. తణుకు మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శ పేరుతో చంద్రబాబు చేపట్టిన పర్యటనలకు జనం, రైతులు కరువయ్యారని ధ్వజమెత్తారు.అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. కాలం కానీ కాలంలో, టైమ్ కానీ టైములో అకాల వర్షాలు పడ్డాయి. అయినా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా సీఎం జగన్ అదేశాలతో అన్ని చర్యలు తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు.

Read More:  ‘రైతులను రెచ్చగొట్టాలని చూసి చంద్రబాబు అభాసుపాలయ్యాడు’ 

 ప్రజలతో కలిసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం! 

Tags:    

Similar News