ఇది చారిత్రక అడుగు.. నితీష్ తో భేటీ అనంతరం ఖర్గే

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని విపక్ష నేతలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం చెప్పారు.

Update: 2023-04-12 10:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని విపక్ష నేతలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే బుధవారం చెప్పారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లు ఇవాళ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఈ సందర్భంగా ఖర్గే వెల్లడించారు. ఈ భేటీ చారిత్రక అడుగు అని అన్ని పార్టీలు ఏకం కావాలని, భవిష్యత్ లో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాహుల్, నితీష్, తేజస్వి, పార్టీ నేతలు సమావేశం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఈ భేటీపై సీఎం నితీష్ కుమార్ స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేస్తామన్నారు. కాగా ఇతర ప్రతిపక్ష పార్టీల్లో కొన్ని కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారితో మాట్లాడే బాధ్యత నితీష్ కుమార్ కు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌, జేడీ(యూ) చీఫ్‌ లాలన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News