హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం!

తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది.

Update: 2023-02-24 13:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం అధికారులు నామినేషన్లను పరిశీలింలించారు. నిబంధనల ప్రకారం లేకపోవడంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో పోటీలో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ ఒక్కరే ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 21 నామినేషన్లు దాఖలు అవ్వగా అవన్ని నిబంధనల మేరకే ఉన్నాయని అధికారులు తేల్చారు. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం నుంచి ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags:    

Similar News