మోడీని గద్దె దించాలని ఇండియా మొత్తం చూస్తోంది: CPI నారాయణ

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు వస్తాయని మోడీ ధీమాతో ఉన్నారు..

Update: 2024-05-23 08:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు వస్తాయని మోడీ ధీమాతో ఉన్నారు.. మోడీని గద్దె దించాలని ఇండియా మొత్తం చూస్తోందని విమర్శించారు. అసలు సౌత్ ఇండియాలో బీజేపీ ఎక్కడా లేదని అన్నారు. బీజేపీ హయాంలో హో‌ల్‌సేల్ అవినీతి జరిగిందని కీలక ఆరోపణలు చేశారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ కింది స్థాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని వెల్లడించారు. అలాగే ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. వీరి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే సీఎం కావాల్సి ఉంటుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News