ఉదయనిధి స్టాలిన్‌పై ట్వీట్.. బీజేపీ నేతపై కేసు నమోదు

సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రోజురోజుకూ గొడవ తీవ్రతరమవుతోంది.

Update: 2023-09-07 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రోజురోజుకూ గొడవ తీవ్రతరమవుతోంది. బీజేపీ నేతలు, హిందుత్వ వాదులు విమర్శలు చేస్తుండగా.. వాటికి స్టాలిన్ సైతం ధీటుగా సమాధానాలు చెబుతున్నారు. తాజాగా.. సనాతర ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్ చేసిన బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. అతడి ట్వీట్‌పై డీఎంకే కార్యకర్త దినకరన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తమిళనాడులో తిరుచ్చిలో మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశ పూర్వకంగా వక్రీకరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News