BJP MP Laxman: 'టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలే నమ్మడం లేదు'

BJP MP Laxman criticises cm kcr over his national party| జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు

Update: 2022-06-11 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: BJP MP Laxman criticises cm kcr over his national party| జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ కే.లక్ష్మణ్ స్పందించారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలే నమ్మడం లేదని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇవ్వడంతో బీఆర్ఎస్ వైపు ప్రయత్నాలు చేస్తున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎవరికైనా రాజకీయ పార్టీని నెలకొల్పే హక్కు ఉందని అలానే కేసీఆర్ కూడా పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. ఆయన పార్టీ పెడితే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ వైపు చూస్తుంటే కేసీఆర్ కొత్త పార్టీ పెడతా అంటున్నాడని, కేసీఆర్ ఎన్ని విన్యాసాలు చేసినా ఎవరు నమ్మరని లక్ష్మణ్ విమర్శించారు.

కేసీఆర్ ఫారన్ పాలసీ ఏంటో చెప్పు:

రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ ముందు తన పార్టీ విదేశీ విధానం ఏంటీ? ఎకానమిక్ పాలసీ ఏంటో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అంటే కేసీఆర్ మనసు ఒప్పుకోదని, ముందు మీ విధానాలేంటో ప్రజలకు వివరించాలని అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోలేకపోతోందని ఇక తొమ్మిది లోక్ సభ సభ్యులు ఉన్న కేసీఆర్ బీజేపీని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. ముందు రాష్ట్రపతి అభ్యర్థికి నామినేషన్ కు కావాల్సిన సంఖ్య ఉందో లేదో ముఖ్యమంత్రి చూసుకోవాలన్నారు.

ప్రభుత్వం చేయని పనిని గవర్నర్ చేస్తున్నారు:

ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రగతి భవన్‌కే మరిమితమైన కేసీఆర్ ప్రజా దర్బార్ పెడుతున్న గవర్నర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చేయలేని పనిని ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ ముందుకొచ్చారని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు బీజేపీ భయపడేది లేదన్న లక్ష్మణ్.. కేసీఆర్ మోసకారి అని అందరికీ అర్థమైందని, ఆయన్ను ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు.

Also Read: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News