కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు బండి సంజయ్.?

bandi sanjay is taken to magistrate from bommala ramaram ps.

Update: 2023-04-05 05:09 GMT

దిశ, వెబ్ డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్ ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా తాజాగా ఆయనను యాదాద్రి భువనగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్తున్నట్లు సమాచారంం. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ప్రధాన సూత్రదారుడు అంటూ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు భారీ భద్రత నడుమ ఆయనను బొమ్మల రామారం పీఎస్ నుంచి తరలించారు. 

Tags:    

Similar News