పోలీసుల త్యాగాలు అజరామరం

దిశ, మెదక్: విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న కృషి, వారి త్యాగాలు ఎన్నటికీ మరవలేనివని మెదక్ జిల్లా ఇంఛార్జ్ అదనపు ఎస్పీ సీతారాం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సందర్భంగా జిల్లా పోలీసు ఏ.అర్. హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అమర వీరుల స్థూపానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం అదనపు ఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ప్రజల సేవకోసం తమ ప్రాణాలను […]

Update: 2020-10-21 12:10 GMT

దిశ, మెదక్:
విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న కృషి, వారి త్యాగాలు ఎన్నటికీ మరవలేనివని మెదక్ జిల్లా ఇంఛార్జ్ అదనపు ఎస్పీ సీతారాం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సందర్భంగా జిల్లా పోలీసు ఏ.అర్. హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అమర వీరుల స్థూపానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం అదనపు ఎస్పీ సీతారాం మాట్లాడుతూ.. ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని అన్నారు. పోలీసు అమరవీరుల ఆశయాలను అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడాలని అన్నారు. ఈకార్యక్రమంలో మెదక్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, ఆర్ ఐ సూరపునాయుడు, డీసీఆర్.బి సీఐ చందర్ రాథోడ్, ఎస్బీ ఎస్సై. సందీప్ రెడ్డి మరియు జిల్లాకు చెందిన సీఐలు, ఎస్సైలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News