ఏ ఇబ్బంది ఉన్నా 100కు ఫోన్ చేయండి !

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు ఉన్నందున ఎస్‌హెచ్‌ఓ నుంచి ఎస్పీ, పోలీస్ కమిషనర్ల వరకూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటినీ ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా డయల్ 100కు ఫోన్ చేయాలని […]

Update: 2020-10-12 12:02 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు ఉన్నందున ఎస్‌హెచ్‌ఓ నుంచి ఎస్పీ, పోలీస్ కమిషనర్ల వరకూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటినీ ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలను డీజీపీ కోరారు.

Tags:    

Similar News