అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

దిశ, మానకొండూరు: మరో నిమిషంలో ఆ శవ దహనం జరిగేది. అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దహన సంస్కారాలు చేయవద్దని చెప్పారు. వెంటనే శవాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని లేనట్టయితే మీ అందరిపై క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతే కొద్దిసేపట్లో కాలి బూడిద కావాల్సిన ఆ మృతదేహం వాహనమెక్కి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది. అసలేం జరిగిందంటే: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లికి చెందిన బొడిగే సంజన వారం క్రితం పురుగుల […]

Update: 2020-08-20 03:06 GMT

దిశ, మానకొండూరు: మరో నిమిషంలో ఆ శవ దహనం జరిగేది. అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దహన సంస్కారాలు చేయవద్దని చెప్పారు. వెంటనే శవాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని లేనట్టయితే మీ అందరిపై క్రిమినల్ కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతే కొద్దిసేపట్లో కాలి బూడిద కావాల్సిన ఆ మృతదేహం వాహనమెక్కి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరింది.

అసలేం జరిగిందంటే:

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లికి చెందిన బొడిగే సంజన వారం క్రితం పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సంజన బుధవారం రాత్రి చనిపోగా ఆమె బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఎల్ఎండి ఎస్సై కృష్ణారెడ్డి పొలంపల్లికి వెల్లి కాష్టంపై చేర్చిన శవాన్ని దహనం చేయవద్దని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ శవాన్ని పోస్టు మార్టం చేయాల్సి ఉంటుందని చెప్పారు. లేనట్టయితే అందరిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని తేల్చారు. దీంతో మృతురాలి బంధువులు వెంటనే శవాన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News