డీఆర్డీఏ అడ్మిన్ అసిస్టెంట్‌పై కేసు

దిశ, వరంగల్: ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లి రావడమే కాకుండా, క్వారంటైన్‌లో ఉండకుండా విధులకు హాజరైన వ్యక్తిపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎవరికీ చెప్పకుండా ప్రార్థనలకు వెళ్లొచ్చి కరోనా వ్యాప్తికి కారణమైన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో అడ్మిన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండీ ఖాజా మొయినొద్దీన్‌పై పోలీసులు చర్యలు చేపట్టినట్టు సీఐ మల్లేశ్ తెలిపారు. డీఆర్డీఏ అధికారి రాంరెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 269, […]

Update: 2020-04-03 08:10 GMT

దిశ, వరంగల్: ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లి రావడమే కాకుండా, క్వారంటైన్‌లో ఉండకుండా విధులకు హాజరైన వ్యక్తిపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎవరికీ చెప్పకుండా ప్రార్థనలకు వెళ్లొచ్చి కరోనా వ్యాప్తికి కారణమైన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ‌లో అడ్మిన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండీ ఖాజా మొయినొద్దీన్‌పై పోలీసులు చర్యలు చేపట్టినట్టు సీఐ మల్లేశ్ తెలిపారు. డీఆర్డీఏ అధికారి రాంరెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 269, 270( ఇతరులకు ప్రాణహాని తలపెట్టడం, వైరస్ వ్యాప్తి చెందేలా ప్రయత్నించడం), సెక్షన్ 188( ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం) వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. అతను ఢిల్లీ నుంచి వచ్చాక కరోనా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసి కూడా యథావిధిగా విధులకు హాజరైనట్టు తెలిపారు. ఈ నెల 21, 23, 27 తేదీల్లో విధుల‌కు హాజరై అధికారులు, ఇతర సిబ్బందితో సన్నిహితంగా మెలిగాడని పోలీసులు నిర్దారించారు. విధుల్లో నిర్లక్ష్యం, సమాచారం లేకుండా ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని, ఇతరులకు హానీ కలిగేలా వ్యవహరించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Tags: drda admin assistant, case file, markaz, without permission, warangal, corona

Tags:    

Similar News