నిషేధిత గుట్కా స్వాధీనం 

దిశ, మహబూబ్ నగర్: నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 40 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట రోడ్డు భగీరథ చౌరస్తా వద్ద ఎస్సై వెంకటేశ్ గౌడ్ తనిఖీలు చేపట్టారు. స్కూటీ మీద వస్తున్న వనపర్తి పాత బజార్‌కు చెందిన అబ్దుల్ గఫార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా కర్ణాటక నుంచి నిషేధిత గుట్కా, తంబాకు ప్యాకెట్లను అక్రమంగా తీసుకువచ్చి వనపర్తిలోని […]

Update: 2020-04-23 06:16 GMT

దిశ, మహబూబ్ నగర్: నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 40 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట రోడ్డు భగీరథ చౌరస్తా వద్ద ఎస్సై వెంకటేశ్ గౌడ్ తనిఖీలు చేపట్టారు. స్కూటీ మీద వస్తున్న వనపర్తి పాత బజార్‌కు చెందిన అబ్దుల్ గఫార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా కర్ణాటక నుంచి నిషేధిత గుట్కా, తంబాకు ప్యాకెట్లను అక్రమంగా తీసుకువచ్చి వనపర్తిలోని షాపుల్లో అమ్ముతున్నట్టు అంగీకరించాడు. గఫార్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

tags : banned gutka, packet, rs.40k value, handover by police

Tags:    

Similar News