భార్య తలను గోడకేసి కొట్టిన సీరియల్ నటుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు కరణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం భార్య నిషా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కారం ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘యే రిష్‌తా క్యా కెహ్లతా హై’ సీరియల్‌తో అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న కరణ్ 2012 లో నిషా ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి కవిష్ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొన్నేళ్లు సవ్యంగానే జరిగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. […]

Update: 2021-06-01 01:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు కరణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం భార్య నిషా ఇచ్చిన ఫిర్యాదుమేరకు కారం ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘యే రిష్‌తా క్యా కెహ్లతా హై’ సీరియల్‌తో అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న కరణ్ 2012 లో నిషా ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి కవిష్ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొన్నేళ్లు సవ్యంగానే జరిగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వీరిద్దరూ వీడిపోనున్నట్లు సోషల్ మీడియా లో వచ్చే వార్తలను ఈ జంట కొట్టిపారేసింది.

 

తామిద్దరం బాగానే ఉన్నామని తెలుపుతూ ‘ నాచ్‌ బలియే’ సీజన్‌-5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే కరణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. అప్పుడు కూడా తన భార్య తనను ఎంతో ప్రేమగా చేసుకున్నట్లు కరణ్ తెలిపాడు. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం నిషా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజుల నుండి తమ మధ్య విబేధాలు తలెత్తాయని, అలాగే గతరాత్రి కూడా కరణ్ తో గొడవపడ్డాడని తెలిపింది. అంతేకాకుండా ఆ గొడవలో కరణ్ తన తలను గోడకేసి కొట్టినట్లు ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కరణ్ ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరయ్యింది.

Tags:    

Similar News