కరోనాను లైట్ తీసుకోకండి…

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్‌ను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని పీఎం నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో పీఎం మత్స్య సంపద యోజనా పథకాన్ని ప్రారంభిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు తమను తాము […]

Update: 2020-09-10 07:19 GMT

దిశ వెబ్ డెస్క్:
కరోనా వైరస్‌ను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని పీఎం నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో పీఎం మత్స్య సంపద యోజనా పథకాన్ని ప్రారంభిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు భౌతిక దూరం పాటించడమే ఉత్తమమని ఆయన తెలిపారు.

Tags:    

Similar News