ప్రధాని మోడీ కీలక ప్రకటన..

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన చేయనున్న ప్రసంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అమలయ్యే ‘వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు’ స్కీంను రేపు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దేశంలోని ప్రజలందరీ ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఇది ఉంటుందని.. ఒక వ్యక్తి తాను చేయించుకున్న […]

Update: 2020-08-14 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన చేయనున్న ప్రసంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అమలయ్యే ‘వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు’ స్కీంను రేపు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దేశంలోని ప్రజలందరీ ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఇది ఉంటుందని.. ఒక వ్యక్తి తాను చేయించుకున్న వైద్య చికిత్సలు, పరీక్షలు, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ ఈ కార్డు కింద పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దేశంలో ఆధార్ కార్డును ఎలా అయితే ఎలా వినియోగిస్తున్నామో, అలాగే ‘వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు’ ఉపయోగపడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News