అంబులెన్స్‌లు నిలిపివేత: హైకోర్టులో పిటిషన్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వివాదం నెలకొంది. ఈ పాస్‌తో పాటు ఆస్పత్రుల అడ్మిష‌న్‌కి సంబంధించి అన్నీ అనుమతులున్నా.. తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారిందిట. దీనిపై సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం లేదంటూ ఏపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీ […]

Update: 2021-05-14 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై వివాదం నెలకొంది. ఈ పాస్‌తో పాటు ఆస్పత్రుల అడ్మిష‌న్‌కి సంబంధించి అన్నీ అనుమతులున్నా.. తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారిందిట. దీనిపై సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం లేదంటూ ఏపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

ఈ క్రమంలో దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి గరిముళ్ల వెంకటకృష్ణారావు పిటిషన్ వేశారు. నాలుగు రోజుల క్రితం ఇదే వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. అంబులెన్స్‌లను అనుమతించాలని కోర్టు తెలిపింది.

 

Similar News