బిగ్ బ్రేకింగ్ : ఔటర్ రింగు రోడ్డుపై వ్యక్తి సజీవదహనం
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పెద్ద గోల్గొండ వద్ద ఏపీ 27సీసీ 0206 నెంబర్ గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేలోగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి […]
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పెద్ద గోల్గొండ వద్ద ఏపీ 27సీసీ 0206 నెంబర్ గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేలోగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.