నకలీ అకౌంట్ల ముఠా కస్టడీకి అనుమతి

దిశ, వెబ్‎డెస్క్: పోలీసుల పేరుతో నకిలీ ఫేస్‎బుక్ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠా కస్టడీ నల్గొండ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్‌లోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్‌ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను ఎనిమిది రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 350కి పైగా పోలీస్ అధికారుల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబడుతామని నల్లగొండ టూ టౌన్ సిఐ […]

Update: 2020-10-08 06:15 GMT

దిశ, వెబ్‎డెస్క్: పోలీసుల పేరుతో నకిలీ ఫేస్‎బుక్ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠా కస్టడీ నల్గొండ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్‌లోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్‌ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను ఎనిమిది రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 350కి పైగా పోలీస్ అధికారుల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబడుతామని నల్లగొండ టూ టౌన్ సిఐ ఎస్ఎం బాషా తెలిపారు. ఈ కేసు విషయంలో నల్గొండ పోలీసులను ఇతర రాష్ట్రాల పోలీసులు సంప్రదిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News