ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్.. వికలాంగులతో అడ్వెంచర్స్

దిశ, ఫీచర్స్ : లక్ష్యసాధనకు వైకల్యం అడ్డు కాదని క్లా(CLAW) గ్రూప్ మెంబర్స్ నిరూపిస్తున్నారు. ఈ క్లా గ్రూప్(కాంకర్ లాండ్, ఎయిర్, వాటర్)ను మాజీ పారా మిలిటరీ ఆఫీసర్ ‘మేజర్ వివేక్ జాకబ్’ ప్రారంభించారు. వికలాంగులు కూడా అన్ని పనులు చేయగలరని చెప్పడమే ఆయన ఉద్దేశం. అందుకోసం ఈ గ్రూప్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్, సోల్జర్స్, సివిలియన్స్.. కొంతమంది దివ్యాంగులను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఎనిమిది మంది దివ్యాంగులకు ఈ గ్రూప్ మెంబర్స్ ట్రైనింగ్ […]

Update: 2021-04-05 05:51 GMT

దిశ, ఫీచర్స్ : లక్ష్యసాధనకు వైకల్యం అడ్డు కాదని క్లా(CLAW) గ్రూప్ మెంబర్స్ నిరూపిస్తున్నారు. ఈ క్లా గ్రూప్(కాంకర్ లాండ్, ఎయిర్, వాటర్)ను మాజీ పారా మిలిటరీ ఆఫీసర్ ‘మేజర్ వివేక్ జాకబ్’ ప్రారంభించారు. వికలాంగులు కూడా అన్ని పనులు చేయగలరని చెప్పడమే ఆయన ఉద్దేశం. అందుకోసం ఈ గ్రూప్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్, సోల్జర్స్, సివిలియన్స్.. కొంతమంది దివ్యాంగులను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఎనిమిది మంది దివ్యాంగులకు ఈ గ్రూప్ మెంబర్స్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

ఈ మేరకు మే నెలలో ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధక్షేత్రమైన సియాచిన్ హిమానీనదాన్ని వారి చేత ఎక్కించి, యూనిక్ రికార్డు క్రియేట్ చేయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం స్కై, స్కూబా డైవింగ్‌తో పాటు పర్వతాలు ఎక్కేందుకు కావాల్సిన చిట్కాలను వారికి నేర్పించనున్నారు. మొత్తంగా వారి చేత భూమి, నీరు, గాలిని జయింపచేయాలన్నదే లక్ష్యం. కాగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్స్‌ సభ్యులుగా ఉన్న ఈ క్లా గ్రూప్.. వైకల్యంతో బాధపడుతున్న వారు కూడా అడ్వెంచర్స్ చేయగలరని చెప్పేందుకు కృషి చేస్తోంది.

Tags:    

Similar News