ప్రజలారా.. లాక్‌డౌన్‌పై సూచనలివ్వండి : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఏడు వారాలు దాటింది. లాక్‌డౌన్‌ను ఎత్తేయడంపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేస్తే కరోనా విజృంభించే అవకాశం ఉంది.. ఒకవేళా కొనసాగిస్తే రెవెన్యూ లాస్. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే, సడలింపులతో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేయాలనే కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. మే 17 తర్వాత […]
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఏడు వారాలు దాటింది. లాక్‌డౌన్‌ను ఎత్తేయడంపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేస్తే కరోనా విజృంభించే అవకాశం ఉంది.. ఒకవేళా కొనసాగిస్తే రెవెన్యూ లాస్. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే, సడలింపులతో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేయాలనే కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. మే 17 తర్వాత అనుసరించే వ్యూహాలను లిఖితపూర్వకంగా అందజేయాలని ప్రధాని కోరారు. తాజాగా, దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. మే 17వ తేదీ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలి? ఎటువంటి ప్రణాళికను అనుసరించాలి? అనే విషయంపై ఢిల్లీ వాసులు తమ అభిప్రాయాలను పంపించాలని కోరారు. అందులో విలువైన సలహాలను వైద్యులు, నిపుణులతో చర్చిస్తామని చెప్పారు. ఈ సూచనలు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1031కి కాల్ చేయాలని లేదా.. 8800007722 నెంబర్‌కు వాట్సప్ చేయాలని.. లేదంటే delhicm.suggestions@gmail.com మెయిల్ ఐడీకి బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు తమ సూచనలు పంపించాలని కోరారు.