‘ఆ చట్టం పేదల పాలిట తిరుగులేని అస్త్రం’

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: లంచావతారులుగా మారిన రెవెన్యూ ఉద్యోగుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చ‌ట్టంపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా రెవెన్యూ చ‌ట్టం తీసుకురావ‌డంపై ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడ‌లో ప్ర‌జ‌లు సంబ‌రాలు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే సండ్ర ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, భారీ ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిత్ర‌ప‌టానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం […]

Update: 2020-09-13 07:05 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: లంచావతారులుగా మారిన రెవెన్యూ ఉద్యోగుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చ‌ట్టంపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా రెవెన్యూ చ‌ట్టం తీసుకురావ‌డంపై ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడ‌లో ప్ర‌జ‌లు సంబ‌రాలు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే సండ్ర ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, భారీ ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిత్ర‌ప‌టానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం పేదల పాలిట తిరుగులేని అస్త్రంగా మారింద‌ని అన్నారు. భూ సమస్యలతో, పాసు పుస్తకాల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగే బాధితుల్లో సీఎం కేసీఆర్‌ ధైర్యం నింపారన్నారు.

Tags:    

Similar News