మంత్రి కొడాలి నానిపై పవన్ ​సెటైర్లు

దిశ, ఏపీ బ్యూరో : పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో ఉంటే బావుండేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం పవన్​ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఆయనకు పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో లేదని చెప్పారు. నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం […]

Update: 2020-12-28 08:49 GMT

దిశ, ఏపీ బ్యూరో : పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో ఉంటే బావుండేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం పవన్​ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఆయనకు పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో లేదని చెప్పారు. నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అంతిమ శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.

 

Tags:    

Similar News