తల్లిదండ్రుల మృతికి కారణమైన కొడుకు, కోడలు అరెస్ట్

దిశ, మునగాల: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాల్సిన కొడుకు, కోడలే వారిపట్ల కర్కషంగా ప్రవర్తించారు. భార్యతో కలిసి కఠినంగా వ్యవహరించి తల్లిదండ్రుల మృతికి కారణమైన కొడుకు, కోడలును పోలీసులు అరెస్ట్ చేశారు. మునగాల ఎస్ఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. మోతే మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన నల్లు రామచంద్రారెడ్డి(90), అతని భార్య అనసూయమ్మ(80)లకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది. తల్లిదండ్రులిద్దరూ కురు వృద్ధులు కావడంతో వారిని పెద్ద కుమారుడు, చిన్న కోడలు నెలకొకరి […]

Update: 2021-06-07 10:19 GMT

దిశ, మునగాల: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాల్సిన కొడుకు, కోడలే వారిపట్ల కర్కషంగా ప్రవర్తించారు. భార్యతో కలిసి కఠినంగా వ్యవహరించి తల్లిదండ్రుల మృతికి కారణమైన కొడుకు, కోడలును పోలీసులు అరెస్ట్ చేశారు. మునగాల ఎస్ఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. మోతే మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన నల్లు రామచంద్రారెడ్డి(90), అతని భార్య అనసూయమ్మ(80)లకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉంది. తల్లిదండ్రులిద్దరూ కురు వృద్ధులు కావడంతో వారిని పెద్ద కుమారుడు, చిన్న కోడలు నెలకొకరి చొప్పున పోషిస్తున్నారు. పెద్ద కుమారుడి వంతు వచ్చిన సమయంలో తల్లిదండ్రులను ఒక ప్లాస్టిక్ పట్టాతో ఏర్పాటు చేసిన షెడ్‌లో ఉంచాడు. భార్యతో కలిసి వారిని పట్టించుకోకుండా, అన్నం పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

దీంతో వారు ఎండకు ఎండి, వానకు తడిసి అనారోగ్యం బారినపడి ఇరువురూ మృతిచెందారు. ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా.. వారిని పూడ్చిపెట్టి, చేతులు దులుపుున్నారు. గ్రామస్తులకు తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మరణించారని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు ఇద్దరూ చనిపోవడం ఏంటని పోలీసులకు సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మిని గట్టిగా మందలించారు. పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. దీంతో తల్లిదండ్రుల మృతికి కొడుకు, కోడలే కారణమని నిర్ధారించి, ఎస్సీ భాస్కరన్ ఆదేశాల మేరకు నాగేశ్వర్ రెడ్డి, అతని భార్య లక్ష్మిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు.

Tags:    

Similar News