సూపర్ స్టార్‌కు ఛాలెంజ్ విసిరిన ‘పలాస’ ఫేం

దిశ, హైదరాబాద్: పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని సినీ నటి, పలాస 1978 సినీ ఫేం నక్షత్ర అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం ఆమె హైదరాబాద్‌లో గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తాతో కలిసి హిల్ ఫోర్డు రోడ్డులో మొక్క నాటారు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యం తగ్గాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గ మన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తాను మొక్కలు నాటినట్లు […]

Update: 2020-07-06 07:07 GMT

దిశ, హైదరాబాద్: పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని సినీ నటి, పలాస 1978 సినీ ఫేం నక్షత్ర అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం ఆమె హైదరాబాద్‌లో గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తాతో కలిసి హిల్ ఫోర్డు రోడ్డులో మొక్క నాటారు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యం తగ్గాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గ మన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తాను మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ నటి రమ్యకృష్ణ, పలాస 1978 సినిమా దర్శకుడు కరుణాకుమార్‌లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు నక్షత్ర తెలిపారు.

Tags:    

Similar News