భారత్‌లో సౌదీ భారీ పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా భారత్‌లో భారీగా పెట్టుబడులను పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఏర్పడ్డ ప్రతికూలత నుంచి భారత్ చాలా వేగంగా కోలుకుంటోందని పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌తో చర్చిస్తున్నట్టు సౌదీ రాయబారి డాక్టర్‌ సౌద్‌ బిన్‌ మహమ్మద్‌ చెప్పారు. వ్యూహాత్మకంగా చూస్తే భారత్ తమకు కీలకమైన దేశమని, ఇప్పుడున్న స్నేహం భవిష్యత్తులో మరింత పటిష్ఠం […]

Update: 2020-12-21 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా భారత్‌లో భారీగా పెట్టుబడులను పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఏర్పడ్డ ప్రతికూలత నుంచి భారత్ చాలా వేగంగా కోలుకుంటోందని పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌తో చర్చిస్తున్నట్టు సౌదీ రాయబారి డాక్టర్‌ సౌద్‌ బిన్‌ మహమ్మద్‌ చెప్పారు. వ్యూహాత్మకంగా చూస్తే భారత్ తమకు కీలకమైన దేశమని, ఇప్పుడున్న స్నేహం భవిష్యత్తులో మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ క్రమంలో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకున్న చర్యలు, ఉద్దీపన పథకాలను ఆయన ప్రశంసించారు. ఇరు దేశాలు ఆర్థికంగా కోలుకుంటే ఇతర దేశాలు కూడా లబ్ది పొందే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సౌదీ యువరాజు మహ్మద్ బిల్ సల్మాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో 100 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడులు మౌలిక వసతులు, పెట్రో కెమికల్స్, ఉత్పత్తి, మైనింగ్, వ్యవసాయన్ రంగాల్లో పెట్టేందుకు సౌదీ అరేబియా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుతో భద్రత, రక్షణ, పునరుత్పాదక ఇందన వనరులు, ఉగ్రవాద నిర్మూలన లాంటి వాటిలో సహకారానికి వీలవుతుందని భావిస్తున్నాయి.

Tags:    

Similar News