Pegasus (spyware): పార్లమెంట్‌ను కుదిపేస్తోన్న పెగాసస్ అంశం

దిశ, వెబ్‌డెస్క్: పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశంలో ఈ వ్యవహారం దుమారం రేపింది. ఈ విషయమై కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వెల్‌లోకి వెళ్లి భారీ ఎత్తున నినాదాలు చేశారు. అంతేగాకుండా.. పెగాసస్ అంశంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై […]

Update: 2021-07-23 00:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా.. శుక్రవారం ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశంలో ఈ వ్యవహారం దుమారం రేపింది. ఈ విషయమై కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వెల్‌లోకి వెళ్లి భారీ ఎత్తున నినాదాలు చేశారు. అంతేగాకుండా.. పెగాసస్ అంశంపై ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జ్యుడీషియల్ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పెగాసస్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, అమిత్ షా రాజీనామా చేయాలని అన్నారు.

Tags:    

Similar News