‘విత్తన భాండాగారంగా తెలంగాణ’

దిశ, మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ‘నియంత్రిత పంటల సాగు’ సదస్సులో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా తెలంగాణను చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. అధికారులు సూచించిన పంటలు వేసి అధిక రాబడి సాధించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామ పంచాయతీల రైతులు ఏకగ్రీవంగా ప్రభుత్వం […]

Update: 2020-05-25 07:47 GMT

దిశ, మెదక్: గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ గ్రామ పంచాయతీ వద్ద జరిగిన ‘నియంత్రిత పంటల సాగు’ సదస్సులో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా తెలంగాణను చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. అధికారులు సూచించిన పంటలు వేసి అధిక రాబడి సాధించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామ పంచాయతీల రైతులు ఏకగ్రీవంగా ప్రభుత్వం సూచించిన పంటలను వేస్తామని తీర్మానం చేయడం సంతోషకరమన్నారు.

Tags:    

Similar News