‘దిశ’ ఎఫెక్ట్.. మేయర్ విజయలక్ష్మి ఆదేశాలతో ప్రాబ్లమ్ సాల్వ్

దిశ, బంజారాహిల్స్ : గత కొన్నాళ్లుగా వీధిలైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్న వాహనదారుల సమస్యపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 కేసీపీ జంక్షన్ నుంచి తాజ్‌కృష్ణ హోటల్ వరకు రాత్రివేళల్లో వీధిలైట్లు వెలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారుల సమస్యపై గత నెల 24న ‘దిశ’పత్రికలో కథనం వెలువడిన సంగతి అందరికీ విధితమే. దీనిపై స్పందించిన విద్యుత్ అధికారులు.. సమస్యను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. మేయర్ చొరవతో అధికారులు32 స్తంభాలకు వీధి దీపాలు, […]

Update: 2021-10-06 07:16 GMT

దిశ, బంజారాహిల్స్ : గత కొన్నాళ్లుగా వీధిలైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్న వాహనదారుల సమస్యపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 కేసీపీ జంక్షన్ నుంచి తాజ్‌కృష్ణ హోటల్ వరకు రాత్రివేళల్లో వీధిలైట్లు వెలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారుల సమస్యపై గత నెల 24న ‘దిశ’పత్రికలో కథనం వెలువడిన సంగతి అందరికీ విధితమే.

దీనిపై స్పందించిన విద్యుత్ అధికారులు.. సమస్యను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. మేయర్ చొరవతో అధికారులు32 స్తంభాలకు వీధి దీపాలు, రెండు చోట్ల హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోడ్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయడం స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Tags:    

Similar News