కాన్వే, ఎక్లిస్టోన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన కాన్వే.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. గత నెలలో ఆడిన మూడు టెస్టుల్లో నిలకడగా ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన డెవాన్ కాన్వేకు జూన్ నెలకు సంబంధించి ప్లేయర్ […]

Update: 2021-07-12 10:41 GMT

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన కాన్వే.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక ఇండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. గత నెలలో ఆడిన మూడు టెస్టుల్లో నిలకడగా ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన డెవాన్ కాన్వేకు జూన్ నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐసీసీ ప్రకటించింది.

ఇక మహిళా క్రికెట్‌కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సోఫి ఎక్లిస్టోన్‌కు దక్కింది. ఇండియాతో జరిగిన ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించినందుకు గాను ఆమెను జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇచ్చారు. కాగా, టీమ్ ఇండియా బ్యాటర్ షెఫాలీ వర్మ వరుసగా రెండు అర్ద సెంచరీలు చేసింది. స్నేహ్ రాణా కూడా 8 వికెట్లతో ఆకట్టుకున్నది. కానీ అవార్డు మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్‌ను వరించింది.

Tags:    

Similar News