మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్‌గా తారక్.. రెమ్యునరేషన్?

దిశ, సినిమా : ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సీజన్ 5 కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రెట్టీ ఎగ్జైటెడ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇంతకు ముందు బిగ్ బాస్ షో హోస్ట్ చేసి పర్‌ఫెక్ట్ యాంకరింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 5 హోస్ట్‌గా మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. అన్నపూర్ణ […]

Update: 2021-03-07 07:12 GMT

దిశ, సినిమా : ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సీజన్ 5 కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రెట్టీ ఎగ్జైటెడ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇంతకు ముందు బిగ్ బాస్ షో హోస్ట్ చేసి పర్‌ఫెక్ట్ యాంకరింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 5 హోస్ట్‌గా మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇందుకు సంబంధించిన చిత్రీకరణ జరగ్గా.. మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకు ముందు మా టీవీలో ప్రసారమైన లైఫ్ చేంజింగ్ గేమ్ షో .. ఇప్పుడు జెమిని టీవీలో స్ట్రీమ్ కాబోతోంది. కాగా ఈ షోకు తారక్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కాగా మా టీవీలో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు .. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రాబోతోంది.

Tags:    

Similar News