ఐపీఎల్ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేం

ప్రాణాలు ఫణంగా పెట్టి ఐపీఎల్ ఆడలేమని, మానవుల జీవితాలకంటే ఐపీఎల్ ఎక్కువేం కాదని కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. రెండు మూడు వారాల్లోగా పరిస్థితి చక్కబడకపోతే ఐపీఎల్ ఈ సారి రద్దు చేయటమే ఉత్తమమని తేల్చి చెప్పారు. శనివారం నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ 15 వరకు పరిస్థితులు కుదటపడకపోతే ఐపీఎల్ […]

Update: 2020-03-14 01:35 GMT

ప్రాణాలు ఫణంగా పెట్టి ఐపీఎల్ ఆడలేమని, మానవుల జీవితాలకంటే ఐపీఎల్ ఎక్కువేం కాదని కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు. రెండు మూడు వారాల్లోగా పరిస్థితి చక్కబడకపోతే ఐపీఎల్ ఈ సారి రద్దు చేయటమే ఉత్తమమని తేల్చి చెప్పారు. శనివారం నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ 15 వరకు పరిస్థితులు కుదటపడకపోతే ఐపీఎల్ రద్దు చేయాలని, లేదంటే ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఒక వేళ రెండు మూడు వారాల్లో పరిస్థతులు మెరుగు పడితే రద్దు నిర్ణయాన్ని పున:పరిశీలించనున్నట్టు చెప్పారు.

tags; no ipl in india,No human life worth sacrificing for IPL,KXIP co-owner Ness Wadia

Tags:    

Similar News