జట్టుతో కలిసిన నితీష్ రాణా
దిశ, స్పోర్ట్స్ : కరోనా బారిన పడి కోలుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా శనివారం జట్టుతో కలిశాడు. శుక్రవారం రెండో సారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో అతడు కోవిడ్ నెగెటివ్‌గా తేలడంతో అతడు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాడు. 12 రోజుల పాటు ఐసోలేషన్‌లో గడిపిన రాణాకు రెండు సార్లు పరీక్షలు చేయగా నెగెటివ్‌గా నిర్దారణ కావడంతో అతడు చెన్నై లోని ట్రైనింగ్ క్యాంపులో సాదన మొదలుపెట్టాడు. ‘ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నది. […]
దిశ, స్పోర్ట్స్ : కరోనా బారిన పడి కోలుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రాణా శనివారం జట్టుతో కలిశాడు. శుక్రవారం రెండో సారి నిర్వహించిన కోవిడ్ టెస్టులో అతడు కోవిడ్ నెగెటివ్‌గా తేలడంతో అతడు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చాడు. 12 రోజుల పాటు ఐసోలేషన్‌లో గడిపిన రాణాకు రెండు సార్లు పరీక్షలు చేయగా నెగెటివ్‌గా నిర్దారణ కావడంతో అతడు చెన్నై లోని ట్రైనింగ్ క్యాంపులో సాదన మొదలుపెట్టాడు.
‘ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నది. శనివారం కాసేపు ప్రాక్టీస్ చేశాను. జట్టుతో చేరడం చాలా సంతోషంగా ఉన్నది. బయట ఉన్నవాళ్లు కోవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అని రాణా సూచించాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రాణా 352 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున 398 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.