పాలకొల్లు నుంచి ఏలూరు సైకిల్‌పై బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఏలూరు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు సైకిల్‌పై బయల్దేరారు. ఎమ్మెల్యే సైకిల్‌పై బయల్దేరడమేంటని అనుకుంటున్నారా?… కరోనా, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆక్వా రైతు సమస్యలను ప్రపంచానికి చాటేలా సైకిల్ యాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టర్, ఎస్పీ తదితరులతో మాట్లాడుదామంటే వారెవరూ అందుబాటులో ఉండడం లేదని, అందుకే నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఆయన సైకిల్‌పై బయల్దేరారు. ఆక్వా, వ్యవసాయ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, దానిని ఎన్నిసార్లు ప్రభుత్వం […]

Update: 2020-04-06 01:33 GMT

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఏలూరు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు సైకిల్‌పై బయల్దేరారు. ఎమ్మెల్యే సైకిల్‌పై బయల్దేరడమేంటని అనుకుంటున్నారా?… కరోనా, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆక్వా రైతు సమస్యలను ప్రపంచానికి చాటేలా సైకిల్ యాత్ర చేపట్టారు. రైతు సమస్యలపై కలెక్టర్, ఎస్పీ తదితరులతో మాట్లాడుదామంటే వారెవరూ అందుబాటులో ఉండడం లేదని, అందుకే నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఆయన సైకిల్‌పై బయల్దేరారు.

ఆక్వా, వ్యవసాయ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, దానిని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తేవాలనుకున్నా ఫలితం లేకుండా పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోనే తాను సైకిల్ యాత్ర చేపట్టానని ఆయన వెల్లడించారు. మద్దతు ధరలపై మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో ధరలకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు.

Tags: nimmala ramanaidu, tdp, bycicle yatra, cycle yatra, aqua farmers, farmers, palakollu to eluru

Tags:    

Similar News