అప్పుడు నేను కాదన్నారు.. ఇప్పుడు నేనే అంటున్నారు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో పాటు రాజకీయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఎంవోకు రాసిన లేఖపై విచారణ చేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో రమేష్ కుమార్ పేరిట లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని, దానిలో సంతకాలు ఫోర్జరీ అని, తమకు దీనిపై తగిన ఆధారాలున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ స్పందించారు. విజయసాయిరెడ్డి […]

Update: 2020-04-16 00:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో పాటు రాజకీయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఎంవోకు రాసిన లేఖపై విచారణ చేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో రమేష్ కుమార్ పేరిట లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని, దానిలో సంతకాలు ఫోర్జరీ అని, తమకు దీనిపై తగిన ఆధారాలున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ స్పందించారు. విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండిస్తూ, ఎస్ఈసీ హోదాలో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. కమిషనర్‌గా తనకున్న పరిధిలోని లేఖ రాశానని ఆయన చెప్పారు. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ లేఖను నిర్ధారించారని, దీనిపై ఎలాంటి వివాదానికి లేదా రాద్దాంతానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా, లేఖపై ఏపీలో వివాదం రేగిన సందర్భంగా… ఆయన హైదరాబాదు తరలక ముందు.. విజయవాడలో మీడియా సమావేశం సందర్భంగా తానాలేఖ రాయలేదని ప్రకటించారు. దీంతో అప్పట్లో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

Tags: ap, ex-sec, nimmagadda ramesh, letter, central home secretary

Tags:    

Similar News