భారత బాక్సర్లకు కాంస్య పతకాలు

దిశ, స్పోర్ట్స్ : బాస్ఫొరస్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఇద్దరు భారత బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు. టర్కీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిఖత్ జరీన్ (51 కేజీలు), గౌరవ్ సోలంకి (57 కేజీలు) ఇద్దరికీ కాంస్య పతకాలు వరించాయి. ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ చాంపియన్ ఎకతరీనాను, క్వార్టర్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన నజైమ్ ఖైజబేను ఓడించిన నిఖత్ జరీన్.. బుసేంజపై సెమీస్‌లో ఓడిపోయింది. ఇక పురుషుల 57 కేజీల విభాగంలో గౌరవ్ సోలంకి అర్జంటీనాకు చెందిన […]

Update: 2021-03-20 08:23 GMT

దిశ, స్పోర్ట్స్ : బాస్ఫొరస్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఇద్దరు భారత బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు. టర్కీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిఖత్ జరీన్ (51 కేజీలు), గౌరవ్ సోలంకి (57 కేజీలు) ఇద్దరికీ కాంస్య పతకాలు వరించాయి. ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ చాంపియన్ ఎకతరీనాను, క్వార్టర్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన నజైమ్ ఖైజబేను ఓడించిన నిఖత్ జరీన్.. బుసేంజపై సెమీస్‌లో ఓడిపోయింది. ఇక పురుషుల 57 కేజీల విభాగంలో గౌరవ్ సోలంకి అర్జంటీనాకు చెందిన నిర్కో క్యూల్లోపై ఓడిపోయాడు. 5-0 బౌట్‌ల తేడాతో ఓడిపోవడంతో అతడు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత బాక్సర్లు సాధించినవి రెండు కాంస్య పతకాలు మాత్రమే కావడం గమనార్హం.

Tags:    

Similar News