మెగా డాటర్‌ను‌ పెళ్లాడేది అతడే..

మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలో మ్యారేజ్ బెల్స్ మోగనున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. నిహారిక పెళ్లి వచ్చే ఏడాది ఉండబోతుందని ఇప్పటికే నాగబాబు ప్రకటించగా.. ఈ విషయంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఊరిస్తోంది నిహారిక. కాఫీ కప్‌పై మిస్ కొట్టేసి.. మిసెస్ నిహారిక? అంటూ సిగ్నల్ ఇచ్చిన భామ.. ఆ తర్వాతి రోజు తనకు కాబోయే భర్తను హగ్ చేసుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. కానీ మొహం మాత్రం […]

Update: 2020-06-19 00:11 GMT

మెగా ఫ్యామిలీ ఇంట్లో త్వరలో మ్యారేజ్ బెల్స్ మోగనున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. నిహారిక పెళ్లి వచ్చే ఏడాది ఉండబోతుందని ఇప్పటికే నాగబాబు ప్రకటించగా.. ఈ విషయంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఊరిస్తోంది నిహారిక. కాఫీ కప్‌పై మిస్ కొట్టేసి.. మిసెస్ నిహారిక? అంటూ సిగ్నల్ ఇచ్చిన భామ.. ఆ తర్వాతి రోజు తనకు కాబోయే భర్తను హగ్ చేసుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. కానీ మొహం మాత్రం చూపించకుండా జాగ్రత్త పడింది. తనెంత జాగ్రత్త పడినా.. ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టేశారు అభిమానులు. గుంటూరుకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి కొడుకు చైతన్యను పెళ్లాడబోతుందని సోషల్ మీడియాలో ఇద్దరి పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. కాగా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అల్లుడు అని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

అయితే పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనే దానిపై మెగా ఫ్యామిలీ వివరాలు ప్రకటించాల్సి ఉంది. ఇక సినిమాల్లో రాణించాలని తపన పడుతున్న నిహారిక.. పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తుందా? లేదా? అని చర్చిస్తున్నారు అభిమానులు.

Tags:    

Similar News