వెంగళరావు నగర్ కొత్త కార్పొరేటర్ పై వేధింపులు

దిశ, క్రైమ్ బ్యూరో : తనను సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన టిక్ టాక్ వీడియోకు టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో పాటు ఇతర వివరాలను యాడ్ చేస్తూ క్రియేట్ చేసిన ఓ వీడియో బుధవారం సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యింది. దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. దురుద్దేశ్య పూర్వకంగానే తన ఫేమ్‌ను తగ్గించేందుకు బీజేపీ నుంచి వెంకట్ […]

Update: 2020-12-30 11:58 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : తనను సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు కార్పొరేటర్ దేదీప్య ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన టిక్ టాక్ వీడియోకు టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో పాటు ఇతర వివరాలను యాడ్ చేస్తూ క్రియేట్ చేసిన ఓ వీడియో బుధవారం సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యింది.

దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. దురుద్దేశ్య పూర్వకంగానే తన ఫేమ్‌ను తగ్గించేందుకు బీజేపీ నుంచి వెంకట్ యాదవ్ మద్దతులో పోటీ చేసిన కిలారి మనోహర్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా, ఈ వీడియోను సర్య్కూలేషన్ చేసిన కిలారి మనోహర్‌కు చెందిన వ్యక్తులు సత్యం, భాను, రాకీలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీసీఎస్ ఎస్ఐ తిరుమలేష్ తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News