ట్రాఫిక్ చలానాల మాయాజాలం.. బైక్ ఓ చోట.. ఫైన్ మరోచోట..
దిశ, బెల్లంపల్లి : ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలపై చలానాలు విధించే ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేరే వ్యక్తి వాహనానికి జరిమానా పడింది. వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలో రిపోర్టర్‌కి చెందిన ద్విచక్ర వాహనం నంబర్ TS 19C5392 గా ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 11వ తేదీన అతడి బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తున్నందుకు రూ.135 చలానాను విధించారు. అయితే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల […]
దిశ, బెల్లంపల్లి : ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలపై చలానాలు విధించే ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వేరే వ్యక్తి వాహనానికి జరిమానా పడింది. వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పట్టణంలో రిపోర్టర్‌కి చెందిన ద్విచక్ర వాహనం నంబర్ TS 19C5392 గా ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 11వ తేదీన అతడి బైక్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తున్నందుకు రూ.135 చలానాను విధించారు.
అయితే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా పోలీసు స్టేషన్ పరిధిలో ఆగస్టు 11న మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వాహనం ఫోటో తీసి, TS 19C5392 వాహనంగా నిర్ధారించుకుని, సదరు వ్యక్తికి హెల్మెట్ లేని కారణంగా రూ.135 జరిమానా విధించారు. ఈ మేరకు సదరు వ్యక్తికి మెస్సేజ్ రావడంతో ఖంగుతున్న వాహన యజమాని.. ఫోటోను నిశితంగా పరిశీలించి ఒక్కసారిగా షాకయ్యాడు.
అది తన వాహనం కాదని.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తిరుగుతున్న వేరే వాహనం TS 19C 53-82 నంబర్ ఉన్న మరో వాహనమని గుర్తించాడు. పొరపాటున ట్రాఫిక్ పోలీసులు 9 నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల తన టూ వీలర్ వాహనం TS 19C 5392 నంబరుకు జరిమానా విధించినట్లు బాధితుడు గుర్తించాడు. ట్రాఫిక్ పోలీసులు నంబర్లు సరిగా చూసి దృవీకరించుకోవాలని కోరాడు. వాహన జరిమానా రూ. 135 తక్కువే అయినప్పటికీ.. ఇతర జిల్లాలో తిరుగుతున్న వాహనాలకు జరిమాని విధించడం కరెక్ట్ కాదన్నారు.
వాహనం నంబర్లు సరిగ్గా చెక్ చేసుకోకపోతే పెద్ద ప్రమాదాలు, జరగరాని సంఘటలు జరిగితే చేయని తప్పుకు అమాయకులు బలి అయ్యే అవకాశాలు ఉన్నాయని వాపోయారు. అధికారులు స్పందించి ఇలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా చూసుకోవాలని బెల్లంపల్లికి చెందిన వాహన యజమాని, ప్రముఖ చానల్ నియోజకవర్గ రిపోర్టర్ వెంకటేష్ సూచించారు.