నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో… పోలీసుల వైద్య శిబిరం

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నక్సల్స్ ప్రభావిత మారుమూల అటవీ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో ఇచ్చోడ సర్కిల్ పోలీసులు, నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సంయుక్తంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ గ్రామాల ప్రజలు నక్సల్స్ కార్యకలాపాలకు సహకరించవద్దని కోరారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం […]

Update: 2020-08-12 07:45 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నక్సల్స్ ప్రభావిత మారుమూల అటవీ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో ఇచ్చోడ సర్కిల్ పోలీసులు, నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సంయుక్తంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ గ్రామాల ప్రజలు నక్సల్స్ కార్యకలాపాలకు సహకరించవద్దని కోరారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. సుమారు 300 మంది గిరిజనులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News