మరోసారి మోడీ.. బీజేపీకి 240-260 సీట్లు: యోగేంద్ర యాదవ్

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు రాజకీయ విశ్లేషకులు వారి వారి సర్వేల ప్రకారం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో పేర్కొంటున్నారు

Update: 2024-05-25 12:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు రాజకీయ విశ్లేషకులు వారి వారి సర్వేల ప్రకారం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్, యుఎస్ పోల్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కు మెజార్టీ వస్తుందని ప్రకటించగా, తాజాగా మరో అనలిస్ట్ యోగేంద్ర యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ అధ్వర్యంలోని బీజేపీ 240-260 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. అలాగే, ఎన్డీయే మిత్రపక్షాలు 35-45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంటే మొత్తంగా బీజేపీ/ఎన్డీయేకి లోక్‌సభలో 275-305 సీట్లు రావచ్చని అన్నారు.

ఇక అధికారంలోకి రావడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ 85-100 సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇండియా కూటమి 120-135 లోక్‌సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని యాదవ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోరు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీలకు సీట్లు పెరుగుతాయని, ముఖ్యంగా బీజేపీకి గతంలో కంటే నాలుగు వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో, అధికార పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎలాంటి అసంతృప్తి లేనందున కేంద్రంలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని అన్నారు.

Similar News