Vikram Lander : చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ తిరిగి భూమికి వస్తుందా?

ఈ రోజు ఉదయం చంద్రయాన్-3 ల్యాండర్‌ విక్రమ్‌కు చెందిన ఇంజన్లను పున:ప్రారంభించే విధంగా శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇచ్చారు.

Update: 2023-09-04 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు ఉదయం చంద్రయాన్-3 ల్యాండర్‌ విక్రమ్‌కు చెందిన ఇంజన్లను పున:ప్రారంభించే విధంగా శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ల్యాండర్ ఇంజన్‌లు స్టార్ట్ కావడమే కాకుండా.. లాండర్ గాలిలోకి లేచి.. 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో తిరిగి సాఫ్ట్ ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ల్యాండర్ విక్రమ్ ఇంజన్‌ను స్టార్ట్ చేసుకుని.. గాల్లోకి లేచి తిరిగి ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడిపై ఉన్న విక్రమ్ ల్యాండర్ తిరిగి భూమికి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన పురోగతి అలాంటిది మరి.

Read More : పైకి లేచి మళ్లీ సాఫ్ట్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ (వీడియో)

Tags:    

Similar News