మళ్లీ నేనే సీఎం.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

Update: 2023-03-22 16:54 GMT

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా హుంగుండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి సామాజిక న్యాయం జరిగేలా తాను చిత్తశుద్ధితో పనిచేశానని, ఫలితంగా గత నాలుగేళ్లలో వార్షిక తలసరి ఆదాయం రూ.1 లక్షకు పెరిగిందని అన్నారు.

‘నేను మళ్లీ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వస్తాను. తల్లి కర్ణాటకకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు. నేను చిత్తశుద్ధితో పనిచేశాను’ అని ఎన్నికల ర్యాలీలో బొమ్మై చెప్పారు. బొమ్మై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం బొమ్మైనే అని ప్రధాని నరేంద్ర మోడీ గానీ, హోంమంత్రి అమిత్ షా గానీ చెప్పడం లేదని ధ్వజమెత్తారు.

కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి మురుగేష్ రుద్రప్ప కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు అర్షద్ చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఏం పనులు చేసిందని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు.

Tags:    

Similar News