డ్యాన్స్ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు.

Update: 2024-04-28 13:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాల్దాహా ఉత్తర టీఎంసీ అభ్యర్థి ప్రసూన్‌కు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో మమతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తులు ధరించిన కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సభలో మాట్లాడిన ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘బెంగాల్‌లో తుపాకులు పేలితే ఎన్‌ఐఏ, సీబీఐ, ఎన్‌ఎస్‌జీ విచారణకు వస్తున్నాయి.. యుద్ధం జరుగుతున్నట్లుంది .. రాష్ట్ర పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వలేదు.. ఏం దొరికిందో.. ఆధారాలు లేవు.. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను (సీబీఐ) కారులో తీసుకొచ్చి ఇక్కడ ఉంచవచ్చు’’ అని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు. సందేశ్‌ఖాలీలో ఒక బీజేపీ నాయకుడు అతని ఇంట్లో బాంబులు నిల్వ చేసాడు. వారు ఉపాధ్యాయ ఉద్యోగాలను రద్దు చేసి, బాంబులతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ చీఫ్ జెపి నడ్డా ఆదివారం మమతా బెనర్జీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉగ్రవాదం పట్ల సానుభూతిని కలిగి ఉందని ఆరోపించారు.

Similar News