రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఓటేయండి- ఖర్గే

ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ చీఫ్. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. మూడో దశ పోలింగ్ పై స్పందించారు ఖర్గే.

Update: 2024-05-07 07:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ చీఫ్. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా.. మూడో దశ పోలింగ్ పై స్పందించారు ఖర్గే. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని.. వాటిని రక్షించేందుకు సరైన పార్టీని గెలిపించాలని ఖర్గే కోరారు. 93 నియోజకవర్గాలలో 11 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తమ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవడమే కాకుండా.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పాటుపడే వారినికే ఓటేయాలని సూచించారు.

11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇవాళ 11 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు, ఇవాళే పోలింగ్ జరగాల్సిన గుజరాత్‌లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News