శిశువు లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు కోసిన కసాయికి జీవితఖైదు విధించిన కోర్టు

మరోసారి గర్భం దాల్చిన తన భార్యతో మగ శిశువు కోసం పన్ను లాల్ తరచూ గొడవ పడుతుండేవాడు.

Update: 2024-05-24 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో కసాయిలా ప్రవర్తించిన ఓ వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని బదౌన్‌లో ఒక వ్యక్తి గర్భవతి అయిన తన భార్య మగబిడ్డకు జన్మనిస్తుందో లేదో తెలుసుకోవడానికి కొడవలితో కడుపు కోసినందుకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2020, సెప్టెంబర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. బదౌన్ సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటున్న పన్నా లాల్, అనిత దంపతులకు ఘటన జరిగే సమయానికి వివాహం జరిగి 22 ఏళ్లు అయింది. అప్పటికే వారిద్దరికీ ఐదుగురు కుమార్తెలు జన్మించారు. మరోసారి గర్భం దాల్చిన తన భార్యతో మగ శిశువు కోసం పన్ను లాల్ తరచూ గొడవ పడుతుండేవాడు. బంధువులు వారించినా సరే పన్నా లాల్ మరోసారి ఆడబిడ్డకు జన్మనిస్తే మరో మహిళను వివాహం చేసుకుంటానని బెదించాడు. ఘటన జరిగిన సమయంలో ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం ముదరడంతో కోపంలో పన్నా లాల్ తన భార్య కడుపును కొడవలితో కోశాడు. అనితా తీవ్రంగా గాయపడటంతో అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల సాయంతో అనిత ఆసుపత్రికి చేరినా శిశువును కాపాడుకోలేకపోయింది. అయితే, ఆమె గర్భంలో మగ శిశువు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో పన్నా లాల్ ఆస్తి తగాద కారణంగా తన భార్యనే నాపై దాడి చేసి గాయపరిచి తప్పుడు కేసులు పెట్టిందని పన్నాలాల్ కోర్టులో వాదించాడు. కానీ, అతని రాక్షసత్వాన్ని నిర్ధారించిన కోర్టు తాజాగా జీవితఖైదు విధించింది. 

Tags:    

Similar News